Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ ట్రెండ్‌కి తగ్గ సినిమా

ఈ ట్రెండ్‌కి తగ్గ సినిమా

- Advertisement -

లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్మమ్మ’. సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక, డా.భద్రం, శివన్నారాయణ, రాకేష్ రాచకొండ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ను ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన ‘వదల’ చిత్ర నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ, ‘రీసెంట్‌గా ఈ సినిమా ప్రీమియర్ చూశా. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. ‘‘మిస్సమ్మ’ లాంటి క్లాసిస్ టైటిల్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి. నేను రాసినదానికంటే మా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌తో మోడ్రన్ మిస్సమ్మ అనే టైటిల్ పెట్టొచ్చు అని నిరూపించారు’ అని డైరెక్టర్ సాయి బాబా చెప్పారు. నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌‌లో ‘కాలింగ్ సహస్ర’ తర్వాత వస్తోన్న రెండో చిత్రమిది. ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నా’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -