స్లో ఓవర్ రేటుతో మ్యాచ్ ఫీజులో కోత
చెన్నై : పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో మ్యాచ్‌లో జరిమానాకు గురయ్యాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్లోనూ గెలుపు బాటలో నడిపిస్తున్నాడు. కానీ నిర్దిష్ట సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయటంలో అయ్యర్ విఫలం అవుతున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆలస్యంగా 20 ఓవర్ల కోటా పూర్తి చేసింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ఫీజులో భారీగా కోత పడింది. రూ. 24 లక్షల జరిమానా శ్రేయస్ అయ్యర్‌పై పడగా.. తుది జట్టులోని ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్‌పై రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా
- Advertisement -
- Advertisement -



