Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌

సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌

- Advertisement -

నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల మలయాళంలోకి అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సంస్థ ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయి దుర్గ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది.
ఈ సినిమాలో హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్‌లో నటించనున్నారు. ప్రణయ్ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన ‘సాహో’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు అడిషినల్ స్క్రీన్‌ప్లే వర్క్ చేశారు. అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నంబర్ 15గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న 5వ చిత్రం కావడం విశేషం. హీరో పుట్టినరోజు సంద ర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సంగీత్ శోభన్‌ను ఇప్పటివరకు చూడని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ కూడా కీలకంగా ఉండనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -