Thursday, August 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకోవిడ్‌ ‌విస్తరణ అమెరికా పాపమే!

కోవిడ్‌ ‌విస్తరణ అమెరికా పాపమే!

- Advertisement -

​కోవిడ్‌ రికార్డుల దాపరికం నిజమేనని ఒప్పుకోలు
నవంబర్‌ 12న శిక్ష ఖరారు చేయనున్న కోర్టు
ప్రపంచవ్యాప్త తప్పిదాన్ని చైనాపైకి నెట్టే ప్రయత్నం
వెల్లడవుతున్న వాస్తవాలు..అమెరికా ఫెడరల్‌ ‌కోర్టులో నేరాన్ని అంగీకరించిన ఫౌచీ సలహాదారు డేవిడ్‌ ‌మోరెన్స్‌

గ్రీన్‌బెల్ట్ (మేరీల్యాండ్)
కోవిడ్‌ ‌మహమ్మారి చైనా లేబొరేటరీస్‌ ‌నుంచి ప్రపంచంలోకి విస్తరించిందని అమెరికా చేసిన ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. తాను చేసిన తప్పుల్ని చైనా మీదకు నెట్టి, ఆ దేశాన్ని అభాసుపాలు చేయాలనే ప్రయత్నాల గుట్టురట్టు అయ్యింది. కోవిడ్‌ ‌సమయంలో అంతటి దుష్ప్రచారం తమ దేశంపై జరుగుతున్నా, చైనా భవిష్యత్‌ ‌కార్యాచరణపై దృష్టి పెట్టిందే తప్ప, ఏనాడు ఏ దేశాన్ని నిందించలేదు. దీనితో భారతదేశంలో కూడా చైనా లేబరేటరీల నుంచే కోవిడ్‌ ‌మహమ్మారి వచ్చిందనే ప్రచారాన్ని మోడీ సర్కారు నిరోధించేచర్యలు చేపట్టలేదు. కాలం గిర్రున తిరిగి, నిజం నిలకడ మీద ప్రపంచానికి తెలిసి వస్తున్నది. అసలు కోవిడ్‌ ‌వైరస్‌‌పై ప్రయోగాలు చేసింది అమెరికానే అనీ, ఆ దేశం దానికోసం నిధుల్ని కూడా సమకూర్చిందని ఆ ఆపరేషన్‌‌లో భాగస్వాములు అయిన మాజీ అధికారులు ఇప్పుడు స్పష్టంచేస్తున్నారు. దీనిపై అమెరికాలో నమోదైన కేసుల్లో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. కరోనా పరిశోధనలకు అమెరికా నిధులు సమకూర్చిం దని ఆ దేశ మాజీ అధికారి అంగీకరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వద్ద సలహాదారుగా పని చేసిన డేవిడ్ మోరెన్స్ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు.

కొవిడ్‌ వైరస్‌పై పరిశోధనలకు వెచ్చించిన నిధుల రికార్డులు, ఇతర పత్రాలను అధికారిక సిస్టమ్‌లో కాకుండా, చట్టాల నుంచి తప్పించుకోవడానికి వ్యక్తిగత ఇ-మెయిల్స్‌లో దాచినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ పరిశోధన గ్రాంట్లకు సంబంధించి ఏప్రిల్ 2020 నుంచి ఏజెన్సీకి అందిన ప్రజా రికార్డుల అభ్యర్థనలను అడ్డుకున్నట్లు డేవిడ్ మోరెన్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు ఆయనను విచారించగా.. తన తప్పును అంగీకరించారు. కోవిడ్‌ మహమ్మారి మొదలైన సమయంలో ఆంథోనీ ఫౌచీ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌’ (ఎన్‌ఐఏఐడీ) అధిపతిగా ఉండగా, తాను సహాయకుడిగా ఉన్నానని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మోరెన్స్ పేర్కొన్నారు. ఈ కేసులో ఆయనకు గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్-19 ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో.. గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై చేస్తున్న పరిశోధన గ్రాంటును నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రద్దు చేయాలని నిర్ణయించుకుంది.

అయితే, ఆ గ్రాంటును పునరుద్ధరించడానికి ల్యాబ్ నుంచి కొవిడ్‌ లీక్ అయిందన్న విషయాన్ని తప్పుడు కథనంగా చూపేలా సాయం చేస్తానని మోరెన్స్ చైనాలోని యాజమాన్యానికి హామీ ఇచ్చారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అందులో భాగంగానే కరోనా సహజసిద్ధంగా, జంతువుల నుంచే వ్యాప్తి చెందిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారన్నారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు వారు ప్రభుత్వ ఇ-మెయిల్‌ ఖాతాకు బదులుగా మోరెన్స్ వ్యక్తిగత ఖాతాను ఉపయోగించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు గుర్తించామన్నారు. దీంతో ఈ విషయంపై ఆంథోనీ ఫౌచీని కూడా విచారించే అవకాశం ఉంది. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం చైనాలోని వుహాన్‌ ప్రయోగశాలకు అమెరికా నుంచి నిధులు అందాయని, ఆ వైరస్‌ పుట్టుకపై వాస్తవాలను అగ్రరాజ్య ఉన్నతస్థాయి వ్యక్తులు తొక్కిపెట్టారని జూన్‌లో అమెరికా మాజీ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ తులసీ గబ్బార్డ్‌ వెల్లడించారు. ఈ మొత్తం కుట్ర వెనుక ఉన్న వ్యక్తి.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన ఆంథోనీ ఫౌచీ అని పేర్కొన్నారు. త్వరలో ఫౌచీని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ కేసు విచారణలో కోవిడ్ మూలాల రికార్డులు దాచేందుకు కుట్ర పన్నినట్టు డేవిడ్ మోరెన్స్ చెప్పడం వల్ల ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో దీనిపై చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా అసలు రంగు బయటపడుతున్నదని పలు దేశాల్లో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -