తొలిసారి భూమిపై
రాకెట్ బూస్టర్ ల్యాండింగ్
బీజింగ్ : చైనా తన వాణిజ్య అంతరిక్ష రంగంలో కీలక ముందడుగు వేసింది. పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో భాగంగా చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ ల్యాండ్‌స్పేస్ తొలిసారిగా తన జూక్యూ- 3 రాకెట్ మొదటి దశను బుధవారం విజయవంతంగా భూమిపై దింపింది. దీంతో కక్ష్యలోకి వెళ్లే రాకెట్ బూస్టర్‌ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రయివేటు అంతరిక్ష సంస్థల జాబితాలో ల్యాండ్‌స్పేస్ కూడా చేరింది. ఇప్పటి వరకూ ఈ ఘనత సాధించిన సంస్థలలో స్పేసఎక్స్, బ్లూ ఆరిజన్ ఉన్నాయి. ఈ రంగంలో అమెరికా ఇప్పటికే ముందంజలో ఉండగా అంతరాన్ని తగ్గించే దిశగా చైనా తాజాగా కీలక అడుగు వేసింది. రాకెట్ బూస్టర్‌ను తిరిగి స్వాధీనం చేసుకొని వాటిని మళ్లీ ప్రయోగిస్తే అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. అంతేకాక ఉపగ్రహాలను తరచుగా అంతరిక్షంలోకి పంపేందుకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది.
66.1 మీటర్ల పొడవైన జూక్యూ – 3 రాకెట్ వాయవ్య చైనాలోని డోంగ్‌ఫెంగ్ కమర్షియల్ స్పేస్ ఇన్నొవేషన్ పైలట్ జోన్ నుంచి నింగిలోకి దూసుకుపోయింది. ప్రయోగం అనంతరం దాని తొమ్మిది ఇంజిన్లతో కూడిన మొదటి దశ రాకెట్ నుంచి విడిపోయింది. అది 390 కిలోమీటర్లు ప్రయాణించి ప్రయోగ కేంద్రానికి ఆగ్నేయ దిశలో ఉన్న గన్సు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ల్యాండింగ్ ప్రదేశంలో విజయవంతంగా దిగింది. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ సిన్హువా కథనం ప్రకారం…జూక్యూ – 3 రాకెట్ మిథేన్, ద్రవ ఆక్సిజన్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ప్రయోగించే విధానంలో జూక్యూ – 3 తక్కువ భూ కక్ష్యలోకి గరిష్టంగా 14.2 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. భవిష్యత్తులో జూక్యూ – 3 బూస్టర్‌ను 20 పర్యాయాల వరకూ పునర్వినియోగం చేయాలని ల్యాండ్‌స్పేస్ లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా గత నెలలోనే రాకెట్ రికవరీలో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. జూలై 10న లాంగ్ మార్చ్ – 10బీ రాకెట్ తొలి దశను సముద్రంలో ఏర్పాటు చేసిన వేదికపై విజయవంతంగా రికవరీ చేసింది. తాజాగా జూక్యూ- 3 రాకెట్ ప్రయోగం ద్వారా తొలిసారి భూమిపై కూడా ల్యాండ్ చేసింది.
అంతరిక్ష రంగంలోచైనా సంచలనం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



