Thursday, August 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకుప్పకూలిన బంగారు గని

కుప్పకూలిన బంగారు గని

- Advertisement -

30 మంది కార్మికులు మృతి
శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొందరు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
​నానా-మాంబెరే ప్రావిన్స్ పరిధిలోని అబ్బా ప్రాంతంలో ఘటన


అబ్బా: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ ప్రాంతంలో గల నానా-మాంబెరే ప్రావిన్స్ పరిధిలోని అబ్బా ప్రాంతంలో మంగళవారం ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నానా-మాంబెరే ప్రావిన్స్‌ ‌పరిధిలోని అబ్బా ప్రాంతంలో గల బంగారు గనిలో కార్మికులు సంప్రదాయ పద్ధతుల్లో తవ్వకాలు చేపడుతుండగా ఒక్కసారిగా గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో పనిచేస్తున్న 30 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, సహాయక బృందాలు కొన్ని గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు సబ్-ప్రిఫెక్చర్ డిప్యూటీ మేయర్ సులేమాన్ బి తెలిపారు. మరోపక్క శిథిలాల కింద చిక్కుకు పోయిన వారిని కాపాడేందుకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు స్థానికులు, అధికారులు తెలిపారు. గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు సాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎవరిస్టే ఎన్గమనా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -