Thursday, August 20, 2026
E-PAPER
Homeఆటలుప్రీ క్వార్టర్స్‌లో ఆయుష్, సింధు

ప్రీ క్వార్టర్స్‌లో ఆయుష్, సింధు

- Advertisement -

– రెండో రౌండ్లో లక్ష్యసేన్‌ పరాజయం
– బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ :
ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ లో రికార్డు ఆరో మెడల్‌పై కన్నేసిన తెలుగు తేజం, అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో కెనడా షట్లర్‌, వరల్డ్‌ నం.49 వెన్‌ యు జాంగ్‌పై పి.వి సింధు 21-16, 21-17తో వరుస గేముల్లో గెలుపొందింది. కెనడా షట్లర్‌పై అలవోక విజయం సాధించిన సింధుకు ప్రీ క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌, చైనా షట్లర్‌ వాంగ్‌ జి యి ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టి సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, వరల్డ్‌ నం.1 షి యుకికి షాక్‌ ఇచ్చిన ఆయుష్‌ శెట్టి.. రెండో రౌండ్లో శ్రీలంక ఆటగాడిని చిత్తు చేశాడు. 21-8, 21-10తో 26 నిమిషాల్లోనే ప్రీ క్వార్టర్స్‌ బెర్త్‌ను ఆయుష్‌ దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా అనూహ్య పరాజయం చవిచూసింది. 13వ సీడ్‌ మిచెలి లీపై తొలి గేమ్‌ను 21-11తో నెగ్గిన ఉన్నతి హుడా.. తర్వాత వరుస గేములను 9-21, 21-23తో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ రెండో రౌండ్లోనే నిరాశపరిచాడు. అమెరికా కుర్రాడు టాన్‌పై 21-9తో తొలి గేమ్‌లో శుభారంభం చేసిన లక్ష్యసేన్‌.. ఆ తర్వాత వరుస గేములను 19-1, 17-21తో కోల్పోయాడు. పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌, అర్జున్‌ జోడీ 17-21, 14-21తో వరుస గేముల్లో ఓటమిపాలయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -