Friday, August 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆసుపత్రికి తరలింపు

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆసుపత్రికి తరలింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 1000 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం అడియాలా జైలు నుండి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఆసుపత్రిలో ఇమ్రాన్‌కు అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, కళ్లకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు నిర్వహించనున్నారు. ఖాన్‌ను తరలించే ముందు అడియాలా జైలులో ఓ వైద్యబృందం పరీక్షించింది. అనంతరం షిఫా ఇంటర్నేషనల్ హాస్పిట్‌కు తరలించినట్లు ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ ధ్రువీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -