- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌ను రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన 2026 ఆగస్టు 20 నుంచి నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. వీరితో పాటు బిలియనీర్ ఆనంద్ మహీంద్రాను కూడా RBI తిరిగి నియమించింది. రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నారు. గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సేవల కార్యదర్శులు కూడా కేంద్ర బోర్డులో సభ్యులుగా ఉన్నారు.
- Advertisement -



