- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతంలో గురువారం 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, మధ్యాహ్నం 1 గంటకు అయకుచో ప్రాంతంలోని ఉపాహుచో సమీపంలో 66.7 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఈ భూకంపం ప్రభావం అనేక దక్షిణ ప్రాంతాలతో పాటు అరేకిపా వంటి ప్రధాన ప్రాంతాలలో కూడా కనిపించింది. పెరూలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.
- Advertisement -


