Friday, August 21, 2026
E-PAPER
HomeNewsసొసైటీల నామినేటెడ్ పై రైతుల అసంతృప్తి పిఏసిఎస్ పై రాజకీయం వద్దు

సొసైటీల నామినేటెడ్ పై రైతుల అసంతృప్తి పిఏసిఎస్ పై రాజకీయం వద్దు

- Advertisement -

ప్రత్యక్ష ఎన్నికలే ముద్దు అంటున్న రైతన్న

నవతెలంగాణ-మల్హర్ రావు

అరే మల్లయ్య.. ఈ సంగతి ఇన్నావా? ఇక నుంచి మన సొసైటీల లీడర్లను ఓట్లేసి ఎన్నుకునే పద్ధతి లేదట..అధికార పార్టీ నుంచే నామినేట్ చేస్తరట..’అంటూ ఐలయ్య అనగానే టీ తాగుతున్న మల్లయ్య ‘అవునా.. గట్లెట్లుంటది..గతంలో ఓట్లతోనే కదా డైరెక్టర్లు, చైర్మన్ ను ఎన్నుకున్నది.ఇప్పుడు ఉండదంటున్నవ్.. మనకు ఓటు హక్కు పోయినట్టేనా..’ అని అనుమానంగా అడిగాడు.అదే గదా గోస! ఇగ ఎన్నికలే ఉండవట..పెద్ద లీడర్లు కూర్చొని పేర్లు రాసిస్తారట..వాళ్లు చెప్పినోళ్లే ఇక చైర్మన్లు, డైరెక్టర్లట!’ అని ఐలయ్య అసహనంగా చెప్పాడు.పీఏసీఎస్ పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రకటించిన నేప థ్యంలో గ్రామాల్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది.

ఈసారి ప్రభుత్వం పీఏసీఎస్ పోస్టులను నామినేటెడ్ విధానంలో ప్రకటిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే.ఈ నిర్ణయంపై గ్రామాల్లో రైతులు మండిపడుతున్నారు.సహకార సంఘం అంటేనే రైతులంతా కలిసి నడుపుకునేది. అలాంటి దాన్ని కూడా రాజకీయం చేసి పార్టీ కార్యకర్తలకు పంచుడేంది? అంటూ పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.భూమిని నమ్ముకుని బతికే సాధారణ రైతుకు రాజకీ యాల్లో పెద్ద తలకాయల సిఫార్సులు ఉండే అవకాశం ఉండదు.అలాంటిది ఓటు లేకుండా ప్రజాస్వామ్య హక్కును లాగేసుకుంటే, సొసైటీలు కేవలం రాజకీయ నాయకుల పునరావాస కేంద్రా లుగా మారుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం,అధికారులు పునరాలోచించి గతంలో మాదిరిగా పాలకవర్గాలను ఎన్నుకునే స్వేచ్ఛ కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం పునరాలోచించాలని తాడిచెర్ల సొసైటీలో సభ్యత్వం ఉన్న మూడువేల మంది రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -