Friday, August 21, 2026
E-PAPER
HomeNewsయువ పారిశ్రామికవేత్తలకు ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ ప్రత్యేక కార్యక్రమం

యువ పారిశ్రామికవేత్తలకు ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ ప్రత్యేక కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ ఆలేరు రూరల్

యువ పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎంఎస్‌ఎంఈ, సినీకా క్రియేటర్స్‌ కౌన్సిల్‌, సినిమాటికా ఎక్స్‌పో సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న ఆలేరు మహిళా సమాఖ్య మీటింగ్‌ హాల్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ చింతకింది మల్లేశం హాజరు కానున్నారని తెలిపారు.

జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, ఎంఎస్‌ఎంఈ యజమానులు, యువ పారిశ్రామికవేత్తలు, క్రియేటివ్‌ రంగాల ప్రతిభావంతుల విజయగాథలను గుర్తించి, ప్రోత్సహించి ప్రపంచానికి పరిచయం చేయడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా సృజనాత్మక పారిశ్రామికవేత్తల అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈలపై అవగాహన కల్పించే వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రుణాలు, గ్రాంట్లు, సబ్సిడీలు, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు,నిధుల సమీకరణ,వ్యాపార అభివృద్ధి, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల ఈడీసీల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఆయా జిల్లాలకు చెందిన విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, కంటెంట్‌ క్రియేటర్లు, యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటివ్‌ రంగాల ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయ అవకాశాలు, వ్యాపార అభివృద్ధిపై అవగాహన పొందడంతో పాటు తమ విజయగాథలను ‘ఫ్రేమ్స్‌ ఆఫ్‌ ఫౌండర్స్‌’ వేదిక ద్వారా పరిచయం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

మరిన్ని వివరాలకు:

రంజిత్‌కుమార్‌,ఈడీసీ మేనేజర్‌, యాదాద్రి భువనగిరి – 9347880615

సతీష్‌, ఈడీసీ మేనేజర్‌, జనగామ – 8008318323

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -