•ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ నరసింహ గౌడ్
నవతెలంగాణ-మర్రిగూడ
ప్రజాసేవే ఈ ఎల్ వి ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఎల్ వి ఫౌండేషన్ మర్రిగూడ మండల కోఆర్డినేటర్ అయితగోని నరసింహ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని భారత్ గార్డెన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫౌండేషన్ చైర్మన్ ఈ ఎల్వి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారని ఆరోపించడం, చేసే కార్యక్రమాలకు కూడా ఆటంకం కలిగించడం సమంజసం కాదన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడడమే ఈ ఎల్వి భాస్కర్ నైజం అన్నారు.
గత కొంతకాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, స్టడీ మెటీరియల్స్, యువతకు క్రీడాకిట్స్, పాఠశాలలకు ఫర్నిచర్స్, పెరాలసిస్ రోగులకు ఉచిత వైద్యం, ప్రభుత్వ పాఠశాలలకు బస్సు సౌకర్యం వంటి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. మండలంలో జెన్యూన్ గా ఉన్న సమస్య ఏదైనా తమ దృష్టికి తెస్తే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమస్య పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఎవరు కూడా ఫౌండేషన్ సేవలను ఈ ఎల్ వి భాస్కర్ రాజకీయ ప్రయోజనాల కోసం చేపడుతున్నట్టుగా భావించవద్దని, మండల ప్రజలు ఫౌండేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులు మాట్లాడుతూ.. ఈ ఎల్వి సేవలను అభినందిస్తూ..మునుముందు నిరుపేద ప్రజల కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి మర్రిగూడ టీం సభ్యులు,మర్రిగూడ మండల జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.



