ఇలా వెళ్లాలి
”సార్… సార్… బార్బర్ షాపుకి ఎలా వెళ్లాలి” అని ఊరికి వచ్చిన పెద్దమనిషి బాబును అడిగాడు.
”జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి.” చెప్పాడా బాబు
రెండెందుకంటే…
పేషెంట్ : డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ చూపిస్తూ.. ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి.
షాపువాడు : రెండెందుకండీ?
పేషెంట్ : ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.
ఎక్కడో చూసినట్టు…
”గురువుగారూ! మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది! మీరు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో ఉన్నారా?”
”అబ్బే లేదండీ! మీ ఎదురింట్లో గత పదేళ్ల నుండీ ఉంటున్నా!
వ్యాసం – దెబ్బలు
టీచర్: రవి ఒంటి మీద ఆ దెబ్బలు ఏంటి?
రవి: గాడిద మీద వ్యాసం రాయమన్నారుగా, గాడిద దగ్గరకు వెళితే తన్నింది టీచర్.
ఖైదీ – నాటకం
కానిస్టేబుల్ : సార్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు.
జైలర్ : ఇది మంచి పరిణామం. దానికి నువ్వెందుకు కంగారు పడుతున్నావు?
కానిస్టేబుల్ : ఎందుకంటే… హనుమంతుడు పాత్ర వేసిన ఖైదీ సంజీవిని తెచ్చేందుకు వెళ్లి ఇంత వరకు తిరిగి రాలేదు సార్.
అత్తారిల్లు
తెలివైన అల్లుడు
అత్తగారి ఇంట్లో చాలాకాలంగా తిష్టవేశాడు కాంతారావు. ఇక వుండబట్టలేక అత్తగారు అడిగేసింది… అల్లుడూ… మీరు వచ్చి నెలైంది. ఇంటికి ఎప్పుడు వెళ్తారు.
అల్లుడు : అదేంటి.. మీ అమ్మాయి మా ఇంట్లో ఇంత కన్నా ఎక్కువే వుందిగా..?
అత్తగారు : నిజమే కానీ, అది తనకి అత్తారిల్లు.
అల్లుడు : అయ్యో… ఇది నాకు మాత్రం పరాయి ఇల్లా. అత్తారిల్లేగా.్
నవ్వుల్ పువ్వుల
- Advertisement -
- Advertisement -



