Sunday, August 23, 2026
E-PAPER
Homeజిల్లాలుసమ్మె విరమించి, చర్చలకు రావాలి: మంత్రి పొన్నం

సమ్మె విరమించి, చర్చలకు రావాలి: మంత్రి పొన్నం

- Advertisement -

– ఆటో కార్మికుల సమస్యల పరిష్కరిస్తాం
నవతెలంగాణ-కోహెడ 

ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామనీ, కార్మికులు సమ్మెను వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని శనిగరం గ్రామంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..డీజిల్, పెట్రోల్ ఆటో లను రేటిరోఫిట్మెంట్ చేసుకోవడానికి రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్మెంట్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో కార్మికుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించిన విధంగానే ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావనీ, సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆటో కార్మికులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -