Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు

రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం (ఆగస్టు 25) వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సంభవించే సూచనలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 25 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -