Sunday, August 23, 2026
E-PAPER
Homeక్రైమ్మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు

మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్టార్‌ యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హీరో యశ్‌ స్టేజిపై మాట్లాడుతుండగా ఆయనను చూసేందుకు అభిమానులు ఫ్లడ్‌లైట్లు, భారీ సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసిన ఇనుప పోల్స్‌పైకి ఎక్కారు. బరువు ఎక్కువ కావడంతో ఓ సౌండ్ బాక్స్ పోల్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగి, ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -