- Advertisement -
నవతెంలగాణ-హైదరాబాద్ : వరంగల్ ఆర్టీసీ రీజియన్‌లో 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్లను అధికారులు తొలగించారు. డిసెంబర్ 31 వరకు కాంట్రాక్ట్ గడువు ఉన్నప్పటికీ, ఈ నెల 21 నుంచే వారిని విధుల్లోంచి తీసేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అకస్మాత్తు తొలగింపుతో ఉద్యోగాలు కోల్పోయిన కండక్టర్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ కాంట్రాక్ట్ గడువు ముగియకముందే తొలగించడానికి కారణం చూపలేదని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
- Advertisement -



