‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి రెండు బ్లాక్‌బస్టర్లను అందించిన హీరో తేజ సజ్జ మరోసారి జాంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీ రెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీ రెడ్డి’తో తెలుగు సినిమాకు జాంబీ జానర్‌ను పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మేకర్స్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమా స్కేల్ ఎలా ఉండబోతుందో చూపించింది. ఈ గ్లింప్స్‌ను పూర్తిగా రివర్స్ ఆర్డర్‌లో ప్రజెంట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కానుంది.
‘జాంబీ రెడ్డి’కి మించి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



