హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో భారీ యాక్షన్ చిత్రం రానుంది. ఇది బాలకృష్ణ నటిస్తున్న 111వ సినిమా. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన సన్నివేశాల కలయికతో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
క్రిస్మస్ కానుకగా విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



