- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. పీవైన్ పీక్ ప్రాంతంలో ప్రారంభమైన మంటలు దాదాపు 20 చదరపు మైళ్లకు విస్తరించడంతో సుమారు 90 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 60 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ గార్డ్స్ మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ కార్చిచ్చు మానవ తప్పిదం వల్లే సంభవించిందని అధికారులు నిర్ధరించి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గవర్నర్ జో లొంబార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
- Advertisement -



