Tuesday, August 25, 2026
E-PAPER
Homeఖమ్మంపర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేటలో మంగళవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.  కళాశాల ప్రిన్సిపాల్ ఏ.అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పర్యావరణ సమస్యల కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని, ఫలితంగా మానవ జీవరాశులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. దేశ భూభాగంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా, జనాభా పెరుగుదలతో అడవుల నరికివేత పెరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిస్తూ పెద్ద వృక్షంగా పెంచాలని విద్యార్థులకు సూచించారు. ‘వృక్షో రక్షిత రక్షితః’ అనే స్ఫూర్తితో మొక్కలను కాపాడితే అవే మనలను కాపాడతాయని అన్నారు. భవిష్యత్ తరాలను పర్యావరణ సమస్యల నుంచి రక్షించే బాధ్యతను ఇప్పటి నుంచే చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి. నరసింహారావు, సీనియర్ అభ్యర్థులు, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఆర్. అరవింద్ బాబు, స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్.కె. షాహెదా, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -