Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను కలిసిన మలిదశ ఉద్యమ నాయకులు  

ఎమ్మెల్యేను కలిసిన మలిదశ ఉద్యమ నాయకులు  

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
మలి దశ తెలంగాణ ఉద్యమకారులు మంగళవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావన చేయాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ.. తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించుటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జంపాల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సీసా మహేశ్వరి, మండల కో కన్వీనర్ ఇక్కిరి శ్రీనివాస్ జంపాల శ్రీనివాస్, కట్టే గుమ్ముల సాగర్ రెడ్డి, కర్రే  అశోకు, జింకల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -