Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ

మొక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ

- Advertisement -

ఏఎమ్మార్ కంపెనీ హెడ్ ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-మల్హర్ రావు

మొక్కల పెంపకంతోనే  మానవాళికి మనుగడ ఉంటుందని తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ హెడ్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం ఓసిపి బ్లాక్-1లో సిసిఏప్ ప్రభాకర్, డిఏప్ఓ కృష్ణగౌడ్, ఏప్డిఓలు అప్పల కొండ, సందీప్ రెడ్డి, కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, సేప్ట్ ఆపిసర్ సురేష్, ఏఎమ్మార్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మానవుల మనుగడ కోసం, పచ్చదనం, పరిశుభ్రత వెలిసేలా మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -