Tuesday, August 25, 2026
E-PAPER
Homeఖమ్మంఏడు సన్న రకాల వరికే రూ.500 లు బోనస్

ఏడు సన్న రకాల వరికే రూ.500 లు బోనస్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం అనుమతించిన ఏడు సన్న రకాల వరి సాగు చేసే రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు ఏడీఏ పెంటేల రవికుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 528, తేదీ 24-08-2026 ద్వారా ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 7715 రకాల వరిని సాగు చేసే రైతులు తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

రైతులు సొంత విత్తనాలతో సన్న రకాల వరిని సాగు చేసినా తప్పనిసరిగా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం రైతు వివరాల ఆన్‌లైన్ నమోదు, క్షేత్రస్థాయి నిర్ధారణ, క్రాప్ బుకింగ్ ప్రక్రియలు పూర్తవుతాయని చెప్పారు.

ధాన్యం కొనుగోలు సమయంలో సన్న రకాల వరికి ప్రాధాన్యత కల్పించడంతోపాటు, క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా చేయూత లభించడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యం అందుబాటులోకి వస్తుందని ఏడీఏ పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన గడువు 10వతేదీ సెప్టెంబర్ 2026 లోగా తమ సాగు వివరాలను నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -