Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలు11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బంధన్ బ్యాంక్

11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బంధన్ బ్యాంక్

- Advertisement -

చెన్నైలోని ఎగ్మూర్‌లో 2,000 వ శాఖ ఆవిష్కరణ
భారతదేశవ్యాప్తంగా 6,400కి చేరిన మొత్తం బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ సంఖ్య
దీంతో బ్యాంక్ దేశంలోని అగ్ర 3 ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది.
మైక్రోఫైనాన్స్ కస్టమర్ల కోసం డిజిటల్ బ్యాంకింగ్‌ను సరళతరం చేసేందుకు ఎంబంధన్‌ లైట్ (mBandhan Lite) ఆవిష్కరణ
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా బంధన్ బ్యాంక్ తన 11వ వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎగ్మూర్ (చెన్నై, తమిళనాడు)లో 2,000వ శాఖను ఆవిష్కరించింది. తద్వారా తన వృద్ధి ప్రస్థానంలో కీలక మైలురాయిని సాధించినట్లయింది. ఈ కొత్త శాఖతో కలిపి భారతదేశవ్యాప్తంగా బ్యాంక్ యొక్క మొత్తం బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ సంఖ్య 6,400కి చేరుకుంది. క్షేత్రస్థాయిలో ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం మరియు పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణ భారతదేశంలో కస్టమర్లకు సేవలు అందించడంపై బ్యాంకునకు గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రత్యేకంగా మైక్రోఫైనాన్స్ కస్టమర్ల కోసం సరళతరంగా రూపొందించిన ఎంబంధన్ లైట్ (mBandhan Lite) మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ని కూడా ఈ సందర్భంగా బ్యాంకు ఆవిష్కరించింది. ఇది మరింత మెరుగైన డిజిటల్ బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఆధార్ ఆధారిత ఆన్‌బోర్డింగ్, అకౌంట్ ట్రాకింగ్, రుణాల రీపేమెంట్ వెసులుబాట్లు, స్టేట్‌మెంట్లు మరియు సర్టిఫికెట్లకు యాక్సెస్, చాట్‌బాట్ అసిస్టెన్స్, అలాగే ఇంగ్లీష్, హిందీ మరియు బెంగాలీలో బహుభాషాపరమైన మద్దతును అందిస్తుంది. తద్వారా కస్టమర్లకు నిరాటంకమైన బ్యాంకింగ్ అనుభూతిని అందజేస్తుంది.

కస్టమర్ల మారుతున్న అవసరాలను తీర్చే విధంగా ఫిజికల్ మరియు డిజిటల్ కార్యకలాపాలను విస్తరించాలన్న బంధన్ బ్యాంక్ వ్యూహాన్ని ఈ రెండు కీలక మైలురాళ్లు ప్రతిబింబిస్తాయి. 2,000వ బ్రాంచీ ప్రారంభమనేది శాఖల నిరంతర విస్తరణను సూచిస్తుంది. అలాగే ఎంబంధన్ లైట్ అనేది డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత సరళతరం, మరింత అందుబాటులోకి తేవడానికి నిదర్శనంగా నిలుస్తుంది. భారతదేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితత్వానికి తోడ్పాటునివ్వడం, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన బ్యాంకింగ్ అనుభూతిని కల్పించడంపై బంధన్ బ్యాంకునకు గల నిబద్ధతను ఈ రెండూ సూచిస్తాయి.

“బంధన్ బ్యాంక్‌నకు ఇది గర్వకారణమైన సందర్భం. 2,000వ శాఖను ప్రారంభించడమనేది మా వృద్ధి సామర్థ్యాలను మరియు వివిధ ప్రాంతాలవ్యాప్తంగా కస్టమర్లకు బ్యాంకింగ్‌ను మరింత అందుబాటులోకి తేవడంపై మాకు గల నిబద్ధతను సూచిస్తుంది. చెన్నైలోని ఎగ్మూర్‌లో శాఖ ప్రారంభంతో మా మొత్తం బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ సంఖ్య 6,400కి చేరుకుంది. ఎంబంధన్ లైట్ అనేది ప్రధానమైన బ్యాంకింగ్ సర్వీసులను మా మైక్రోఫైనాన్స్ కస్టమర్లకు మరింత అందుబాటులోకి తేవడంపై మేము దృష్టి పెడుతుండటాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మైలురాళ్లను సాధించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. భారతదేశవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాలు మరియు వివిధ వర్గాలకు సాధికారత కల్పించేలా నిరాటంకమైన మరియు సమ్మిళితమైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం” అనిబంధన్ బ్యాంక్ ఎండీ & సీఈవో Mr. పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా తెలిపారు. బంధన్ బ్యాంక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను 35 చోట్ల కార్యకలాపాలు సాగిస్తోంది. భారత్‌లో 6,400 బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ ద్వారా 3.2 కోట్ల మందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -