Tuesday, August 25, 2026
E-PAPER
Homeజిల్లాలుఎమ్మెల్యే రేవూరికి ఎస్ఎఫ్ఐ నాయకుల వినతి

ఎమ్మెల్యే రేవూరికి ఎస్ఎఫ్ఐ నాయకుల వినతి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పట్టణంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన టాయిలెట్లు, బాత్రూమ్‌లను నిర్మించాలని కోరారు. అలాగే కళాశాల ప్రధాన గేటు వద్ద విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ కోసం అటెండర్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.

పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని కోరారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పరకాల పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్, మండల అధ్యక్షుడు కోగీల సాయి తేజ, మండల ఉపాధ్యక్షుడు కొమ్ముల రాహుల్, శివ, భరత్, సన్నీ, మహేష్, సందీప్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -