Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రధాన మంత్రి 
పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు?

ప్రధాన మంత్రి 
పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు?

- Advertisement -

ఎంపీ ఈటల రాజేందర్ కు జగ్గారెడ్డి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

శతృదేశం పాకిస్తాన్ కు వెళ్లి అక్కడి ప్రధానమంత్రితో నవాజ్ షరీఫ్ ఇంటికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు వెళ్లారో చెప్పాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత వ్యతిరేక శక్తులతో సమావేశమవుతున్నందునే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను అనుమతించలేదని ఈటల రాజేందర్ చేసిన వాదనను ఆయన కొట్టిపారేశారు. ఎలాంటి సమాచారం లేకుండా మోడీ పాకిస్తాన్ వెళ్లిన దానిపై మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీది వన్ సైడ్ లవ్ అనీ, రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు అంకితభావంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆగస్టు సంక్షోభం టీడీపీదేనని కాంగ్రెస్ కు వర్తించదని, ప్రభుత్వానికి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -