- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏషియన్ గేమ్స్ 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జపాన్‌లోని ఐచి, నగోయా నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషుల విభాగంలో 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు పాల్గొంటున్నాయి. పురుషుల విభాగంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. పురుషుల క్వార్టర్ ఫైనల్స్ సెప్టెంబర్ 28న, సెమీ ఫైనల్స్ అక్టోబర్ 1న, ఫైనల్స్ అక్టోబర్ 3న జరుగుతాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ సెప్టెంబర్ 17-18న, సెమీ ఫైనల్స్ సెప్టెంబర్ 20న, ఫైనల్స్ సెప్టెంబర్ 22న జరుగుతాయి.
- Advertisement -



