- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని బస్వాపూర్ జీపీ కార్యాలయంలో డ్వాక్రా నూతన కమిటీని ఆ సంఘ సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా హనుమవ్వ, ఉపాధ్యక్షురాలుగా సోనీ, కార్యదర్శిగా రామవ్వ, సహాయ కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా లక్ష్మీబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ సురేష్ గొండ ఎన్నికైన నూతన కమిటీకి కీలక సూచనలు చేశారు. సమావేశానికి సీసీ సంజు, వివో భాస్కర్, చిన్న సంఘాల లీడర్లు, సంఘ సభ్యులు, తదితరులు హాజరైయ్యారు.
- Advertisement -



