- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని కొడిచెర గ్రామంలో బుధవారం కాంగ్రెస్ మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు, జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్ ఆ గ్రామ మాజీ సర్పంచ్ సంయుక్తంగా ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. అనంతరం లబ్దిదారులు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల సొంతింటి కళ ఇందిరమ్మ రాజ్యంలో సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కళ సాకారానికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా సహకరించిన కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులకు లబ్దిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



