ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో చాలామంది అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫోన్లలో సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తూ, ఇష్టమైన వెబ్ సిరీస్‌లు చూస్తూ లేదా పెండింగ్‌లో ఉన్న ఆఫీస్ పనులను పూర్తి చేస్తూ గడిపేస్తున్నారు. అయితే మిమ్మల్ని మీరే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రపోయే సమయం చాలా ముఖ్యం: జీవితాంతం మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం తగినంత నిద్రపోవడం చాలా అవసరం. నిద్ర అనేది శరీరం, మనస్సు రెండింటికీ ఎంతో ముఖ్యం. ఈ ప్రక్రియ మెదడును తదుపరి రోజు కోసం సిద్ధం చేయడానికి, సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, భద్రపరచడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం నుంచి రోగనిరోధక శక్తి, హార్మోన్ల సమతుల్యత వరకు, శరీరంలోని కీలకమైన విధుల్లో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.నిద్రపోయే సమయమే మీ ఆరోగ్యాన్ని శాసిస్తుంది: మీరు ఏ సమయానికి నిద్రపోతున్నారు అనేదే మీ శరీరం ఎంత బాగా కోలుకుంటుంది, కొవ్వును ఎంతవరకు కరిగిస్తుంది, శరీరంలోని హార్మోన్లను ఎలా సమతుల్యం చేస్తుంది అనే విషయాలను నిర్ణయిస్తుంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు శరీరానికి ఎంతో కీలకం. ఈ సమయంలో మీరు నిద్రను ఆలస్యం చేసే ప్రతి గంటకు, మీ శరీరం తనను తాను పునరుజ్జీవింపజేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతుంది.రాత్రి 1 గంటకు నిద్రపోతే? : నిద్రను రాత్రి 1 గంట వరకు ఆలస్యం చేసినప్పుడు, శరీరంలో జరిగే ప్రధాన రికవరీ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి 9-10 గంటల మధ్య : శరీరం టాక్సిన్స్ తొలగించడం, కణాల మరమ్మత్తును ప్రారంభిస్తుంది.రాత్రి 11 గంటలకు : మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అలాగే, జీవక్రియను పునరుద్ధరించే గాఢ నిద్ర ప్రారంభమవుతుంది.రాత్రి 12 గంటలకు : కొవ్వును కరిగించి HGH వంటి హార్మోన్లు విడుదలవుతాయి.రాత్రి 1-2 గంటల మధ్య : నిద్రపోకుండా మేల్కొని ఉంటే, కాలేయం డిటాక్స్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం పెరుగుతుంది.తెల్లవారుజామున 3 గంటల నుంచి : నిద్ర తేలికగా మారుతుంది. అలాగే, శరీరం కోలుకునే ప్రక్రియ గణనీయంగా తగ్గిపోతుంది.శారీరక, ఆరోగ్య సమస్యలు : హార్మోన్ల సమతుల్యత, బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలు, ఒత్తిడి, మానసిక స్థితి నియంత్రణసరిచేసుకోవడం ఎలా? : రాత్రి 11 గంటల కంటే ముందే నిద్రపోవడం అలవాటు చేసుకోండి. శరీరం నాచురల్ రిథమ్ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత టీ, కాఫీలకు దూరంగా ఉండండి. పడుకోవడానికి గంట ముందు మొబైల్ స్క్రీన్కు దూరంగా ఉండాలి. మెరుగైన నిద్ర కోసం అరటిపండ్లు, నట్స్, పాలకూర, డార్క్ చాక్లెట్ వంటి మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
సమయానికి నిద్రపోతున్నారా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



