న్యూయార్క్ : ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ అమెరికా పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘సార్వత్రిక ఏకత్వం’, ‘నాగరిక సంభాషణ’లను ప్రోత్సహించే సాంస్కృతిక సంస్థగా అమెరికా ప్రజల ఎదుట తననుతాను ప్రదర్శించుకోవడానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశ్నించింది. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో సంభాషించే అమెరికా రాజకీయ, వ్యాపార, మత, పౌర నాయకులు ఆ సంస్థ యొక్క చరిత్రను, భావజాలాన్ని, రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కు చెందిన అమెరికా ఛాప్టర్ కోరింది. మత జాతీయతావాదం, మైనారిటీ హక్కులపై కూడా ఛాప్టర్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్ఎస్ఎస్ విదేశీ సందేశాలను దాని చారిత్రక భావజాల రికార్డుతో పాటు పరిశీలించాల్సి ఉన్నదని తెలిపింది.
భగవత్ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



