Thursday, August 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌లో తాత్కాలిక కారిడార్‌ !

హార్ముజ్‌లో తాత్కాలిక కారిడార్‌ !

- Advertisement -


నిర్వహణపై ఒమన్‌తో ఇరాన్‌ చర్చలు
మస్కట్‌ :
హార్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు వీలుగా తాత్కాలిక కారిడార్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. జలసంధి నిర్వహణపై ఇరాన్‌ తన పొరుగు దేశమైన ఒమన్‌తో తాజాగా చర్చలు జరిపింది. హార్ముజ్‌ మీదుగాఏర్పాటు చేసే తాత్కాలిక కారిడార్‌పై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఒమన్‌ విదేశాంగ మంత్రి బదర్‌ అల్బుసైదీ చెప్పారు. ‘హార్ముజ్‌ జలసంధిలో నౌకాయానం కోసం తాత్కాలిక కారిడార్‌ను, అలాగే నౌకల రవాణాను పునరుద్ధరించడానికి ఆచరణాత్మక ఏర్పాట్లను త్వరలోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నాను’ అని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలియజేశారు. అమెరికా-ఇజ్రాయిల్‌ సేనల దాడుల నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్‌ మూసివేసిన విషయం తెలిసిందే. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు రవాణాలో ఐదో వంతును నిర్వహించిన ఈ జలసంధి మీదుగా నౌకాయానాన్ని పునరుద్ధరించే విషయంపై ఇరాన్‌, ఒమన్‌ అనేక వారాలుగా అడపాదడపా చర్చలు జరుపుతున్నాయి. కాగా ఉమ్మడి తాత్కాలిక నౌకాయాన కారిడార్‌ గురించి చర్చించామని, అందులో ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించేందుకు అంగీకరించామని రెండు దేశాలు తాజాగా ప్రకటించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -