రాజ్యాంగ మార్పులకు సిద్ధంగా ఉండాలంటూ మూడు దేశాల అల్టిమేటం
తమ భవిష్యత్తు ఈయూతోనేనని స్పష్టీకరణ
లండన్ : బ్రిటన్ ఐక్యతకు విఘాతం ఏర్పడింది. బ్రిటన్ విచ్ఛిన్నానికి దారితీసే ఒప్పందంపై వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ దేశాలు సోమవారం సంతకాలు చేశాయి. అమెరికాలోని ఈ మూడు ప్రాంతాలు పాక్షిక స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి. అంటే ఇవి పూర్తిగా స్వతంత్ర దేశాలు కావు. కానీ తమ పరిదిలో సొంత ప్రభుత్వాలను, నిర్ణయాధికారాలను కలిగి ఉంటాయి. వీటిని పాలించే ప్రభుత్వ అధినేతలను ‘మొదటి మంత్రులు’ (ఫస్ట్ మినిస్టర్స్) అంటారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌కు జాన్ స్విన్నీ, వేల్స్‌కు రైన్ అప్ లోర్వర్త్, ఉత్తర ఐర్లాండ్‌కు మిచెల్లీ ఒనిల్ ఫస్ట్ మినిస్టర్స్‌గా ఉన్నారు. రాజ్యాంగ మార్పులకు సిద్ధంగా ఉండాలని, తమ భవిష్యత్తు యూరోపియన్ యూనియన్‌తో ముడిపడి ఉన్నదని ఈ ముగ్గురూ బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌కు, ఆయన ప్రభుత ్వానికి తెలియజేశారు.
ట్రంప్ వ్యాఖ్య తర్వాత…
‘వెస్ట్ మినిస్టర్ (పార్లమెంట్) కాలం ముగిసిపోతోందని చెప్పడానికి ఈ ద్వీపాలలో నివసిస్తున్న ప్రజలకు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా గమనిస్తున్న ప్రజలకు ఇంతకంటే స్పష్టమైన సంకేతం మరోటి ఉండదు’ అని ఈ ముగ్గురు నేతలు సోమవారం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలో తెలియజేశారు. పునరేకీకరణ చెందిన ఐర్లాండ్‌ను చూడాలని ఎంతగానో కోరుకుం టున్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన 48 గంటల తర్వాత ఈ సంయుక్త ప్రకటన వెలువడడం గమనార్హం. ఐరిష్ ఓపెన్‌కు ఆతిథ్యమిస్తున్న తన గోల్ఫ్ కోర్సును సంద ర్శించే పర్యటనలో ఉన్నప్పుడు ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు. మూడు దేశాల నేతలు స్వాతంత్య్రాన్ని కోరు కుంటున్న పార్టీలకు చెందిన వారే కావడం, ఉత్తర ఐర్లాండ్ విషయంలో ఏకీకరణకు అను కూలంగా ఉండడం ఇదే మొదటిసారి. వంద సంవత్స రాల క్రితం బ్రిటన్ నుంచి ఐర్లాండ్ స్వాతంత్య్రం పొందింది. ఆ సమయంలో ఉత్తర ఐర్లాండ్ వేరుపడి బ్రిటన్‌లో భాగంగానే ఉండిపోయింది.
రిఫరెండంకు బర్న్‌హామ్ ‘నో’
బ్రిటన్ నుంచి వేరుపడాలని 2014లో స్కాట్లాండ్ చేసిన ప్రయత్నం ఫలించ లేదు. విభజనను 55 శాతం మంది వ్యతిరేకించగా 45 శాతం మంది మాత్రమే సమర్ధించారు. ప్రజా భిప్రాయ సేకరణకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతిస్తే ఇప్పుడు స్వాతంత్య్రానికి అను కూలంగా ప్రజలు ఓటేస్తారని స్కాట్లాండ్ నేషనల్ పార్టీ నాయకు డొకరు చెప్పారు. కాగా ఓటింగుకు తొలుత సుముఖత తెలిపిన బ్రిటన్ ప్రధాని బర్న్‌హామ్ ఆ తర్వాత ‘అందుబాటులో లేదు’ అంటూ సమాధానమిచ్చారు.
ప్రజలు ఐక్యంగా ఉండాలన్న ప్రధాని ప్రతినిధి
మూడు దేశాల అల్టిమేటంను ప్రధాని బర్న్‌హామ్ ప్రతినిధి టామ్ వెల్స్ తోసి పుచ్చారు. పాశ్చాత్య దేశాల యూని యన్‌ను ప్రధాని గట్టిగా విశ్వసిస్తున్నారని, రాజ్యాంగ పరమైన చర్చల కంటే జీవన వ్యయాన్ని తగ్గిం చడం పైనే ఆయన ఎక్కువగా దృష్టి కేంద్రీ కరి స్తున్నారని ఆయన చెప్పా రు. విభజ నకు బదు లుగా ఉమ్మడి విలువలు, సమ స్యల పరి ష్కారం కోసం ప్రజలు ఏకమైనప్పుడు బ్రిటన్ అత్యు త్తమంగా ఉంటుందని అన్నారు. కాగా స్వాతంత్య్రంపై తమ దేశాలలో ప్రజా భిప్రాయ సేకరణ జరగాలని స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్స్ పిలుపు నిచ్చారు. మూడు దేశాల నేతలు అధికార హోదాలో కాకుండా రాజకీయ హోదాలో సమావేశానికి హాజరవడం విశేషం.



