Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగామలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

జనగామలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – బీబీపేట్ : బీబీపేట్ మండలంలోని  జనగామ గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం   కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను గ్రామ సర్పంచ్‌ మట్ట శ్రీనివాస్‌, జీపీ‌ఓ రవి, గ్రామ కార్యదర్శి రవి, బీబీపేట మాజీ వైస్‌ ఎంపీపీ కపిర రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్త రేషన్‌ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ అందించే బియ్యం తదితర ప్రయోజనాలు సులభంగా అందనున్నాయని పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ  కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ స్వామి, వార్డ్ మెంబర్ నరసింహ చారి, మహిళా సంఘం సిఏలు దేవేంద్ర, వనిత, గ్రామస్తులు  కిషన్ రావు, రాజం, శంకర్ తదితరులు పాల్గొన్నారు  కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -