నవతెలంగాణ-నాచారం: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నాచారం పోలీస్ స్టేషన్‌లో ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమంలో భాగంగా సహచరి రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసు శాఖకు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయ గౌడ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మాన్సింగ్, ఎస్‌ఐలు ఎస్.కె. మైబెల్లి, పి. ప్రభాకర్ రెడ్డి, గోవర్ధన్, మహిళా ఎస్‌ఐ విజయతో పాటు ఇతర పోలీసు సిబ్బందికి సహచరులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులు సహచరులను గిఫ్ట్ హ్యాంపర్లతో సత్కరించి వారి సేవలను అభినందించారు.కార్యక్రమంలో సహచరుల పాత్ర, నేరాల నివారణలో వారి భాగస్వామ్యం, ప్రజా భద్రత పరిరక్షణలో సహకారం, పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి సహచరి ఒక బాధ్యతగల పౌరుడిగా, పోలీసు శాఖకు వారధిగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.
పోలీసు–ప్రజల అనుబంధం బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



