Thursday, August 27, 2026
E-PAPER
Homeఆటలుబరిలోకి సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులు

బరిలోకి సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారత క్రికెట్‌ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వారసులు బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా అండర్‌-19తో జరగనున్న సిరీస్‌కు భారత జట్టులో ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, అన్వయ్‌ ద్రవిడ్‌కు చోటు దక్కింది.భారత్‌-ఆస్ట్రేలియా అండర్‌-19 జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్‌ లో రాజ్‌కోట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌కు ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. అన్వయ్‌ ద్రవిడ్‌ ఇటీవల శ్రీలంక పర్యటనలో రెండు వన్డేలు ఆడి 101 పరుగులు చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -