Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడ్వాయిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

తాడ్వాయిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుమన వాణి, తహశీల్దార్ కార్యాలయం నందు, తహశీల్దార్ మంజుల, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బు దేవేందర్, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దండగల మల్లయ్య లతో పాటుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, అన్ని గ్రామ పంచాయతీలలో, మండలంలోని అన్ని పాఠశాలలో జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మారై డేగల సాంబయ్య, సునీల్, ఎంపీ ఓ శ్రీధర్ రావు, వివిధ పార్టీల నాయకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -