Friday, August 28, 2026
E-PAPER
Homeఖమ్మంరక్షాబంధన్ తోబుట్టువుల ఆత్మీయతా ను రాగాలకు సాక్ష్యం: ప్రిన్సిపాల్

రక్షాబంధన్ తోబుట్టువుల ఆత్మీయతా ను రాగాలకు సాక్ష్యం: ప్రిన్సిపాల్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : రక్షాబంధన్ పండుగ తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.అనిత అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఏ.అనిత మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా జరుపుకుంటారని తెలిపారు.సోదరీమణులు సోదరుల చేతికి రాఖీ కట్టి వారి సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలను కోరుకుంటారని, సోదరులు వారికి అండగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తారని చెప్పారు. ఈ పండుగ కుటుంబ విలువలు, ప్రేమ, నమ్మకం, బాధ్యత, ఐక్యత, పరస్పర గౌరవాన్ని గుర్తుచేస్తుందని పేర్కొన్నారు.

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి.నరసింహారావు మాట్లాడుతూ ‘రక్ష’ అంటే రక్షణ, ‘బంధన్’ అంటే బంధం అని వివరించారు. రక్షాబంధన్ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, రక్షణ బంధానికి ప్రతీక అని అన్నారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు యువత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఏ.అనిత సమక్షంలో విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -