- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాల నివారణపై రాఖీ పండుగ పూట ఢిల్లీ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. “రాఖీ వాగ్దానం, రక్షణ సంకల్పం” (“Rakhi Ka Waada, Suraksha Ka Iraada”) అంటూ వాహనాదారులకు మహిళా సిబ్బంది రాఖీలు కట్టారు. పరస్పర బాధ్యత, రహదారి భద్రతకు సంబంధించిన సందేశాన్ని అందించడానికి రక్షాబంధన్ పండుగ స్ఫూర్తి అని తెలియజేశారు. దేశ రాజధానిలోని షాదరా సర్కిల్, చింతామణి రెడ్ లైట్, సీలంపూర్ రెడ్ లైట్, మజ్ను కా తిలా చెక్ పోస్ట్ వంటి ప్రాంతాలతో పాటు నగరంలోని అనేక ఇతర ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ పాయింట్ల వద్ద రోడ్డు భద్రతా విభాగం సర్కిల్ సిబ్బంది ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -



