- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నేరుగా చేరాలనే లక్ష్యంతో, అర్హులైన వారికి సుమారు 87వేల స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మార్వో మారుతి, ప్రజాప్రతినిధులు బొంపెలి విజయ్, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



