- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం సీలింగ్ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పేదలే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుందన్నారు. తాము ఆరు గ్యారెంటీలను అమలుచేస్తుంటే బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎవరికీ అందలేదన్నారు. భూభారతి తెచ్చాక సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని, పేదలకు ఇళ్లు ఇస్తుంటే తట్టుకోలేక విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
- Advertisement -



