Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్‌ మోసాలపై కదం తొక్కాలే

కాంగ్రెస్‌ మోసాలపై కదం తొక్కాలే

- Advertisement -

వెయ్యి రోజుల పాలనపై నిలదీయాలే
సెప్టెంబర్ 02 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ పిలుపు
నవతెలంగాణ – మల్హర్ రావు

అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజలను చేసిన మోసాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కదం తొక్కాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు. శనివారం మంథని రాజగృహాలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 2 నుంచి ప్రతి మండల కేంద్రంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. అధికారంలోని వచ్చి వేయి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హమీ సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. ఓట్ల కోసం ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డులు ఇచ్చారని, ఆ బాకీ కార్డులతో నిరసన కార్యక్రమాలు చేపట్టి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 420 హామీల మోసాలను ప్రతి నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందనీ, మంథనిలో బీఆర్‌ఎస్‌ సమరభేరిని మ్రోగించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -