మండలంలో 6,653 మందికి నోటీలు
అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా
నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. మ్యాపింగ్ కాని అనామలిస్ జాబితాలో చేరిన ఓటర్లందరికీ నోటీసు లు సైతం జారీ చేస్తున్నారు.ఇప్పటికే ఈ నోటీసులపై విచారణ సైతం చేపడుతున్నారు. నోటీసులు అందుకున్న ప్రతిఒక్కరూ వారి వద్దనున్న ఆధారాలు చూపడంతో పాటు, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.సెప్టెంబర్ 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.మండలంలో మ్యాపింగ్ కానివి 1,167,అనామలిస్ 5,486 మొత్తం 6,653 మందికి నోటీసులు జారీ చేశారు.అర్హత గల ప్రతీ ఒక్క రికి ఓటు హక్కుదక్కాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం చూపించాల్సి ఉంటుంది.ఇప్పటికే సర్ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల నేతలతో అధికారులు సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఓటర్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు,అనంతరం చేపట్టిన చర్యల గురించి ఖచ్చితంగా తెలియజేయాలని తెలిపారు.అర్హత గల ప్రతీ ఓటరుకు ఓటు హక్కు కల్పించడం తో పాటు,పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించేందుకు అందరు సహకరించాలని పేర్కొంటున్నారు.నోటీసులు అందుకున్న వారు ఏఈఆర్వోలుగా ఉన్న తహసీల్దార్ ఎదుట హాజరై వివరించుకోవాల్సి ఉంటుంది.2002లో తమతో పాటు,తమ కుటుంబ పెద్దలకు సంబంధించిన ఓటు వివరాలు,ఆధారాలతో అధికారులకు చూపడంతో పాటు, అన్ని సక్రమంగా ఉన్నట్లయితే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.అనంతరం ఓటు హక్కు ఉంటుంది.
గ్రామ సభల నిర్వహణ..
సర్ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు.అబ్ సెంట్,షిఫ్ట్,డెత్ జాబితాను మ్యాపింగ్ నోటీసులు బీఎల్వోలు చదివి వినిపించారు.అలాగే సభలో పారం 6,7,8 అందుబాటులో ఉంచారు.మరో ప్రక్రియ అయిన అనాలమసిస్ (ఓటర్ల వివరాల లోపం) మ్యాపింగ్ కానీ,పాత,ప్రస్తుత రికార్డుల్లో లేని వివరాలను సేకరిస్తున్నారు.ఆధారాలు సక్రమంగా ఉంటేనే ఓటు లభిస్తుంది.ఎన్నికల సంఘం చూపమన్న 12 గుర్తింపు కార్డుల్లో ఎదో ఒకటి చూపితే వారికి ఓటుహక్కు దక్కనుంది.లేనిచో ఓటుపోయే అవకాశాలు సైతం ఉంటాయి.అనామలసిస్ ఉన్నవారికి పుట్టిన తేదీలో తప్పులు,కుటుంబ సభ్యుల మధ్య వయస్సుకు సంబంధించిన ఆసాదారణ వ్యత్యాసాలు,ఇంగ్లీష్,తెలుగు అనువాదాలలో పేర్లు మారడం వంటి లోపాలను సవరించుకోవచ్చు.ఓట్ల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలన్న ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గదువులోపు ఆధారాలు అందించాలి: రవికుమార్ మండల తహశీల్దార్
2022లో ఓటరు జాబితాలో మ్యాపింగ్ కానీ ఓటర్లకు నోటీలు జారీ చేశాం.వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఓటర్లకు నోటిసులు అందుతాయి.నోటీసులు అందుకున్నవారు గదువులోపు ఆధారాలు బిఎల్ఓ లకు సమర్పించాలి.



