కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘చిరంజీవి’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మించారు. శుభ సాయి వెంకట్ దర్శకుడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద రక్షాబంధన్ విన్నర్ గా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను శనివారం సాయంత్రం మేకర్స్ నిర్వహించారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ,‘ఈ టీమ్ లోని వాళ్లంతా ఒక కొత్త కథను, ఎక్స్ట్రార్డినరీ కాన్సెప్ట్ ను నమ్మి నిజాయితీగా కష్టపడి పనిచేశారు. అలా పని చేసినప్పుడు సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. కమర్షియల్ గా ఆ సినిమా రేంజ్ ఏంటి అనే కంటే క్రియేటివ్ గా ఎంత పేరు తెచ్చుకుంది, ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంది అనేది ముఖ్యం’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన రోజే సక్సెస్ సాధించా మని సంతోషించాం. ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించడం నిజమైన ఆనందాన్ని కలిగిస్తోంది’ అని డైరెక్టర్ శుభ సాయి వెంకట్ చెప్పారు. ‘మాకు విజ యాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానైనా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు’ అని ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి అన్నారు.
‘చిరంజీవి’కి రెస్పాన్స్ సూపర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



