నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ,‘నాకు ఈ ట్రైలర్ చాలా నచ్చింది. చాలా కష్టపడి సినిమాను తీశారు అనే ఫీలింగ్ ట్రైలర్ కలిగించింది. ఇదే క్వాలిటీ సినిమాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. అద్భుతమైన రైటింగ్‌తో తీస్తే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆడియన్స్ చూస్తారు. అందరూ ఇది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా’ అని తెలిపారు.
‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా సెన్సార్‌లోనే 8 నెలల పాటు ఉందని విన్నాను. కచ్చితంగా అందరికీ నచ్చడం వల్లే సెన్సార్ నుంచి బయటకు వచ్చింది. నిర్మాత ఈ సినిమాకి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయన మరో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’ అని రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి చెప్పారు. డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ,‘మేము చాలా గర్వపడే సినిమా తీశాము. టెక్నికల్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన క్వాలిటీతో తీశాం. ఇది తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాథ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్.
థ్రిల్ చేసే యూనిక్ స్పై డ్రామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



