- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపల సీజన్ మొదలైంది. తాజాగా మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలు వేలంలో రికార్డు ధర పలికాయి. యానాం రేవులో జరిగిన వేలంపాటలో ఈ రెండు చేపలను కలిపి ఓ మహిళ ఏకంగా రూ.31,500 కు కొనుగోలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మత్స్యకారులకు 1.3 కేజీల బరువున్న రెండు పులస చేపలు చిక్కాయి. వాటికి నిర్వహించిన వేలంలో మత్స్యకార మహిళ పార్వతి పాల్గొన్నారు. ఒక చేపను రూ. 24,000 కు, మరో చేపను రూ.7,500 కు మొత్తం రూ.31,500కు ఆమె దక్కించుకున్నారు.
- Advertisement -


