Sunday, August 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅప్పుడు ‘ఆయా షేర్‌’... ఇప్పుడు ‘యెష నాగుల’

అప్పుడు ‘ఆయా షేర్‌’… ఇప్పుడు ‘యెష నాగుల’

- Advertisement -

హీరో నాని నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘యెష నాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద బాణీకి అనిరుధ్ తనదైన హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్‌లో లైవ్‌గా విడుదల చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య పాటను లైవ్‌లో ప్రదర్శిం చగా, ప్రేక్షకులు డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పాట మూడ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. లైవ్లీగా, క్యాచీగా సాగుతూ పక్కా జానపద నేటివిటీని ప్రజెంట్ చేశాయి. జంగి రెడ్డి వోకల్స్ పాటకు అథెంటిక్ రస్టిక్ టచ్‌ను అందించగా, ప్రభా తన వోకల్స్ పాటలోని ఎనర్జీని మరింత పెంచారు.

ఆట సందీప్ రిథమ్‌కు అను గుణంగా ఫోక్ మూవ్‌మెంట్స్, మాస్ డ్యాన్స్ స్టెప్స్‌ను మేళవిస్తూ కొరియోగ్రఫీ అందించారు. పాటను కలర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేయడంతో మ్యూజిక్‌తో పాటు విజువల్‌గానూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పాటలో నాని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. నాని డ్యాన్స్‌లో ఎనర్జీ, స్టైల్, యాటిట్యూడ్ కనిపిస్తాయి. కీర్తి సురేష్ నాని ఎనర్జీకి పర్ఫెక్ట్ కాంప్లిమెంట్‌గా నిలుస్తూ విజువల్స్‌కు మరింత చార్మ్‌ను జోడించారు. వీరిద్దరి కాంబినేషన్ డ్యాన్స్ పోర్షన్స్‌కు మరింత ఆకర్షణగా నిలిచింది. సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -