నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం టిఎన్జీవో ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా, ఎంప్లాయ్ జే ఏ సి జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన,కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో, మహిళా ఉద్యోగ సోదరిమణులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది, ఇట్టి పోటీలకు వివిధ శాఖల మహిళా ఉద్యోగ సోదరీమణులు, ఔత్సాహికులు పోటీల్లో పాల్గొని తమ తమ ప్రతిభ ఆధారంగా రకరకాల రంగవల్లికలను నిర్ణీత సమయంలో వేయగ, ఇట్టి పోటీలకు న్యాయ నిర్నేతలుగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ పి.యాది రెడ్డి , జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రకాంత్ , హాజరై ప్రతి పోటీదారుల వద్దకు వెళ్లి రంగవల్లికలను వీక్షించి అభినందించి, మొదటి బహుమతిగా సాయి ప్రసన్న, నీటిపారుదల శాఖ, రెండవ బహుమతి ఎస్.వినోద, జిల్లా పౌరసరఫరాల శాఖ, మూడవ బహుమతి టి.వినీత, పశువైద్య శాఖ, కన్సోలేషన్ బహుమతులు ఎస్.సుజాత డీఅర్డీఏ, సౌమ్య, మాత, శిశు సంక్షేమ శాఖ… గెలుపొందగా, పోటీదారులకు ముఖ్య అతిథులు పి.యాది రెడ్డి బహుమతుల ప్రధానం చేసి ప్రతి ఒక్కరిని అభినందించి సంక్రాంతి పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ… టీఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందనతో మహిళ ఉద్యోగ సోదరీమణులు హాజరై, క్రమశిక్షణతో రంగవల్లికలు వేసిన తీరుకు మంత్రముగ్ధులమయ్యామని, ప్రతి సంవత్సరం టీఎన్జీవో ఆధ్వర్యంలో ఇట్టి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. పోటీల్లో పాల్గొన్న పోటీదారులు అందరికీ అభినందిస్తూ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, ఎం.సతీష్ కుమార్, టీఎన్జీవో జిల్లా మహిళా కార్యవర్గ సభ్యులు, కె.పి సునీత , వసుమతి దేవి, మంజుల, ఇందిర ,విజయలక్ష్మి ,సంధ్య రాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, సంజీవయ్య ,సత్యం ,దినేష్ బాబు, మహేందర్, ఉమా కిరణ్, సతీష్ ,ప్రవీణ్, మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.